ఖైరతాబాద్ : ఆగస్టు 12 (జనం సాక్షి) ఫ్రీడమ్ ఆయిల్ తయారీ దారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(జీఈఎఫ్ ఇండియా) తమ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సేవాభారతితో కలిసి రు.10 లక్షల విలువైన ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్యాకెట్లను తెలంగాణా రాష్ట్రంలో వరదల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో పంపిణీ చేసింది. తెలంగాణాలో పలు ప్రాంతాలలో ఇటీవల కాలంలో సంభవించిన వరదల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో, విద్య, ఆరోగ్యం, సామాజిక సమానత్వం, నిరుపేదల సాధికారిత వంటి అంశాలలో కృషి చేస్తోన్న లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్ధ సేవా భారతిలో కలిసి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వదరల కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు నిత్యావసరాలను అందించేందుకు ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం గురించి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీ.చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ ‘జీఈఎఫ్ ఇండియా’ వద్ద మేము ఆహారం మనిషికి ప్రాథమిక హక్కుగా భావిస్తుంటామన్నారు. అందువల్ల, సమాజం పట్ల ఈ బాధ్యత నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. వరదల కారణంగా ప్రభావితమైన తెలంగాణా జిల్లాల్లో ప్రజలకు ఆహారం అందించడం కోసం సేవాభారతితో భాగస్వామ్యం చేసుకున్నామన్నారు. ప్రభావిత కుటుంబాలకు సహాయపడేందుకు రూ.10 లక్షల విలువైన ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్యాకెట్లను అందించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించడం కోసం జీఈఎఫ్ ఇండియా తమ తొలినాళ్ల నుంచి కృషి చేస్తూనే ఉందన్నారు.