వరిని వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు

– వ్యవసాయ సహాయ సంచాలకులు వాసవి రాణి

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి): మాగాణి లో వరి పంటకు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే విధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో వరిని వెదజల్లే పద్ధతి, డ్రీమ్ సీడర్తో నాటు వేసే పద్ధతితో రైతులు అధిక దిగుబడులు సాధిస్తూ వరి పంట వ్యవసాయంలో ఆసక్తి చూపుతున్నారని ఇల్లందు వ్యవసాయ సహాయ సంచాలకులు వాసవి రాణి అన్నారు. వరి విత్తనాలను పిఎస్బి బ్యాక్టీరియల్ తో కలిపి వెదజల్లాలని రైతులకు సూచించారు. సోమవారం బేతంపూడి గ్రామంలో అశోక్ అనే రైతు రెండు ఎకరాల మాగాణిలో వరిని వెదజల్లే పద్ధతిలో వేసేందుకు వారు సలహా సూచనలు అందించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన నెల క్రితం ఈర్ల వెంకన్న , టేకులపల్లి కి చెందిన జాలాది శ్రీను అనే రైతులు ఆరు ఎకరాలలో డ్రమ్స్ సీడర్ తో నాటు వేసిన పొలంను పరిశీలించారు.