వర్మికంపోస్ట్ తయారీ వాడకంపై షెడ్యూల్డ్ ఎస్సీ కులాలకు చెందిన వారికి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ నారమ్ హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో సెప్టెంబర్ 4వ వారంలో 50 మంది షెడ్యూల్డ్ ఎస్సీ కులాల రైతులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేవీకే ఇంచార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లవ కుమార్ తెలిపారు. ఆసక్తి కలిగిన షెడ్యూల్డ్ ఎస్సీ పంటల సాగు చేస్తున్న రైతులు మీ పేరు గ్రామం ఆధార్ కార్డు కుల ధ్రువీకరణ పత్రాన్ని జతపరుస్తు తమ పేర్లును నేరుగా కే.వి.కే.నందు నమోదు చేసుకోగలరు. ట్రైనింగ్ పొందిన రైతులకు ఒక్క వర్మీకంపోస్ట్ బ్యాగ్ నాలబై కేజీ ఉచితంగా అందజేయపడును . వివరాలకు ఏ.కిరణ్ మృత్తిక శాస్త్రవేత్త.సెల్ 7893989055 సంప్రదించి పేర్లు నమోదు చేసుకోగలరు.
Attachments area