వాన కోసం ఎదురు చూస్తు గణపతి ముందు ఉయ్యాల పాటలు పాడిన ఏజెన్సీ రైతులు
గంగారం సెప్టెంబర్ 2 (జనం సాక్షి)
పెద్దఎల్లపురం గ్రామంలో శుక్రవారం రోజున రాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాన దేవున్ని మొక్కుతూ ఉయ్యాల ఊగారు గత 20 రోజుల నుండి వర్షాలు కురువకపోవడంతో వేసిన మొక్కజొన్న పంట రైతు పూర్తిగా పెట్టుబడులు పెట్టారు కానీ రైతుకు లాభాలు వచ్చే సమయంలో వర్షాలు పడకపోవడంతో ఎండిపోతుందని పూర్తిగా ఏజెన్సీ కావడంతో ఎలాంటి కాలువలు చెరువులు నీటి సౌకర్యం లేకపోవడంతో పూర్తిగా వర్షాధారంపై ఆధారపడడం ఇక్కడ రైతుల యొక్క శాపంగా మారిందని వానదేవుడు ఇకనైనా కరుణించాలని గణపతి దేవుని ముందు మొక్కుతూ ఉయ్యాల పాటలు పాడినారు