వారసత్వ ఉద్యోగాలను బలిచేసిందే వారు: తెబొగకాసం
కరీంనగర్,జూన్25(జనం సాక్షి ): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పొగొట్టిన ఘనత జాతీయ కార్మిక సంఘాలదే అని తెబొగకాసం నేతలు అన్నారు. ఆనాడు వారసత్వ ఉద్యోగాలు ఎత్తిపోతే వీరు సమ్మె, ఆందోళనలు ఎందుకు చేయాలేదో కార్మిక వర్గానికి స్పష్టం చేయాలని తెబొగకాసం నేతలు డిమాండ్ చేశారు. వారసత్వం అమలు చేసేందుకు యాజమాన్యం, ప్రభుత్వం, గుర్తింపు సంఘం అన్ని విధాలా ఆలోచనలు చేస్తోందని పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకోచ్చే బాధ్యత గుర్తింపు సంఘం, ప్రభుత్వంపై ఉందన్నారు.