వాసవి కుటుంబ భద్రత మొదటి సమావేశం
వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 20(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఆర్య వైశ్య భవనం లో శనివారం వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం చైర్మన్ గుండా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో వాసవి కుటుంబ భద్రత స్కీం మొదటి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం లోని 11 కార్పొరేషన్లలో ఇరవై ఎనిమిది వందల మంది సభ్యులకు ఈ కుటుంబ భద్రత స్కీము వర్తిస్తుందని ప్రతి నెల రెగ్యులర్ గా డబ్బులు చెల్లించే వారు ఇందులో అర్హులని సమావేశం తెలిపింది ఈ కార్యక్రమంలో పెద్దలు పోకల చందర్ఎల్లంకి రవీందర్ పాపన్న ,ఉపేందర్, తోట పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు