వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా హెల్మెట్ ధరించాలి!
●హెల్మెట్ ధరించిన వారికి సన్మానించిన
ఎస్సై కుమార్ రాజా!
ఎల్లారెడ్డి౼జనంసాక్షి(ఏప్రిల్- 30)
ఎల్లారెడ్డి:వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎల్లారెడ్డి ఎస్సై కుమార్ రాజా అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 29వ జాతీయ రోడ్డుభద్రతావార్షికోత్సవల్లో భాగంగా వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వేసుకొని నడుపుతున్న ద్విచక్రవాహనాలకు వారికి ఎస్సై కుమార్ రాజా శాలువతో సన్మానించారు.హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనాలకు గులాబీ పువ్వులు ఇచ్చి హెల్మెట్ ధరించని అన్నారు.ఎస్సై కుమార్ రాజా మాట్లాడుతూహెల్మెట్ దరించకుండా వాహనాలు నడుపుతున్న వారే ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని అన్నారు.మైనార్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని,వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడడం,డ్రైవర్ సిటులోనే ఇతరులను కూర్చోబెట్టుకోవడం,ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టరీతిన డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణం చేయటం,వాహనాలు మద్యం మత్తులో నడపవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నియమాలు పాటించి ప్రమాదరహిత కోసం పాటుపడాలని ఎల్లారెడ్డి ఎస్సై కుమార్ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కాంస్టేబుల్ మోతి,రమేష్,పెంటయ్య,బంతిలాల్ తోపాటు వాహనదారులు పాల్గొన్నారు