విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన మల్లారెడ్డి

శివ్వంపేట ఆగస్ట్ 17 జనంసాక్షి :
పూడూర్ గ్రామానికి చెందిన హరిహరనందన అయ్యప్ప దేవాలయ ధర్మకర్త రొండ మల్లారెడ్డి తన స్వంత డబ్బులు వెచ్చించి పూడూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సరస్వతీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కోసం  భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్త రొండ మల్లారెడ్డి మాట్లాడుతూ తన సంపాదనలో కొంత దేవాలయాలకు, సామాజిక కార్యక్రమాలకు దైవ చింతన కార్యక్రమాలకు సహాయ సహకారాలను అందిస్తానన్నారు. తాను పుట్టి, పెరిగిన పూడూర్ గ్రామానికి ఏదో విధంగా సహాయ పడాలనే ఉద్దేశంతో ఉన్నత పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటు చేసే అదృష్టం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. వీలైనంత తొందరలోనే సరస్వతి అమ్మవారి విగ్రహన్ని ప్రతిష్ట చేయిస్తానని ఆయన అన్నారు. సరస్వతి అమ్మవారి విగ్రహన్ని ఏర్పాటు చేయిస్తున్న దాత రొండ మల్లారెడ్డికి పూడూరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ నీరుడి రఘు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వార్డు మెంబర్ జనార్ధన్ యాదవ్, సొసైటీ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు తుపాకుల కృష్ణ, మల్లెల కృష్ణ, టీఆర్ఎస్ గ్రామ కమిటీ మాజీ అద్యక్షులు గాదం రాములు యాదవ్, నాయకులు అమరేందర్ రెడ్డి, మిర్ దొడ్డి సత్యనారాయణ, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విగ్రహా శిల్పి సంజీవ, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Attachments area