విజయనగరం వికలాంగుల నార్త్‌జోన్ క్రికెట్ పోటీలు
విజయనగరం, జూలై 11 : విజయనగరంలో వికలాంగుల నార్త్‌జోన్ క్రికెట్ పోటీలను త్వరలో నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (వికలాంగుల విభాగం) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామాంజుల నాయక్ వెల్లడించారు. స్థానిక ఎంఆర్ కళాశాల క్రీడామైదానంలో జిల్లా వికలాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు జరిగాయి. దాదాపు 35 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వాసుదేవరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈపోటీలకు అధిక సంఖ్యలో క్రీడాకారులు రావడం విశేషమని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన రామాంజుల నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా జట్టు నార్త్‌జోన్ పోటీలలో పాల్గొంటుందని చెప్పారు. జట్టుకు ఎంపికైన సభ్యులు చంద్రశేఖర్ (కెప్టెన్), మోహనరావు (వైస్ కెప్టెన్), అప్నన్న, సర్వేశ్వరరావు, ఈశ్వరరావు, నూకరాజు, కుమార్, నారాయణరావు, గోపాలకృష్ణ, గణేష్, సతీష్, ఈశ్వరరావు, తిరుపతిరావు, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, రామచంద్రరావు ఉన్నారు.