విజయమ్మ దీక్షకు మద్దతిస్తే సహించం…

గోదావరిఖని, జులై 22 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు మద్దతినిస్తే సహించేది లేదని టీబీజీకే ఎస్‌ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం సంఘ కార్యా లయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నకిలీ తెలంగాణవాదిగా హెచ్‌ఎం ఎస్‌ నాయకులు రి యాజ్‌అహ్మద్‌ సిరిసిల్ల దీక్షకు మద్దతి నివ్వడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తుంగలొ తొక్కిన ట్టవుతుందన్నారు. విజయమ్మకు మద్దతిని వ్వడంలో రియాజ్‌ అధికా ర దాహం బట్టబయలవుతుందన్నా రు. ఇలాంటి వాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ సమా వేశంలో నాయకులు నూనె కొముర య్య, కేసీఆర్‌.రెడ్డి, దామోదర్‌రావు, ప్యారేమియా, లక్ష్మణ్‌, గద్ద కుమారస్వామి, దామ నర్సయ్య, జి.రవి, మొగిలి, అంతయ్య, రామస్వామి, మహేందర్‌రావు, వెంకటేశం, యాదయ్య, తోట మల్లేష్‌, మొగిలి, సురంజన్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

దీక్షను సహించం…

సిరిసిల్లాలో విజయమ్మ చేపట్టిన దీక్షను సహించమని… హెచ్‌ఎంఎస్‌కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేపట్టిన దీక్షను అన్ని పక్షాలు వ్యతిరేకించాలన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలను అమలుపరచడానికి… ఆమె ఈ దీక్షకు పూనుకుందన్నారు.