విజయమ్మ దీక్ష అడ్డుకోవడానికి వెళ్తున్న 40 మంది తెలంగాణ వాదులను అరెస్టు చేసిన పోలీసులు

గోదావరిఖని: ప్రధాన చౌరస్తాలో ప్రైవేటు బస్సులో వెళ్తున్న తెలంగాణ వాదులను అరెస్టు చేశారు. బస్సులో ఉన్న వారిని పోలీసులు బలవంతంగా స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొందరు తెలంగాణ వాదులు పోలీసులతో వెల్లడానికి నిరకరించి మొండికేయడంతో గందగోలం పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు తెలంగాణ వాదుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. రామగుండం 8ఇంక్లాం కాలనీ, సెంటనరీ కాలనీ, ఎన్టీపీసీ జ్యోతి నగర్‌లలో కూడా తెలంగాణ వాదులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.