విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో బస్సు దహనం

కరీంనగర్‌: విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త బస్టాండ్‌లో బస్సుకు నిప్పంటించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ రేపు తెలంగాణ వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.