విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయం..
– పూర్వపు విద్యార్థి దాతృత్వం.
– గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు.
ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి):
ఊరుకొండ పేట ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన అదే గ్రామానికి చెందిన ఆరెడ్ల పరశురాం రెడ్డి విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు తన వంతు సహాయ సహకారంగా డ్రమ్స్ అందించడం అభినందనీయమని గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అన్నారు. సోమవారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడ దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పూర్వపు విద్యార్థి అరెడ్ల పరుశరాంరెడ్డి గారు పాఠశాలకు డ్రమ్స్ ను అందచేసారు. పాఠశాలలో డ్రమ్స్ కొరతతో పాఠశాల యాజమాన్యం గ్రామ సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి గారికి తెలపడంతో స్పందించిన సర్పంచ్ గారు పూర్వపు విద్యార్థి అరేడ్ల పరశురాం రెడ్డి గారిని కోరడంతో వెంటనే గ్రామ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయంగా కృషి చేస్తానని తెలిపి పాఠశాల యాజమాన్యానికి గ్రామ సర్పంచ్ గారికి తెలపడం జరిగింది సోమవారం రోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులు యువకులతో కలిసి డ్రమ్స్ ను అందజేశారు యువకులు నాగోజి గారు మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ ముందుకు వస్తున్న యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పాఠశాలకు డ్రమ్స్ ను దానం చేసిన ఆరేడ్ల పరశురామ్ రెడ్డి గారికి పాలకమండలి సభ్యుల తరఫున సన్మానం చేశారు తదనంతరం పాఠశాల సిబ్బంది కూడా దాతకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు యాదయ్య గౌడ్ గారు మాట్లాడుతూ రాబోవు రోజులలో పెద్ద ఎత్తున గ్రామ పూర్వపు విద్యార్థులు తమ వంతు సహాయంగా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు తదనంతరం జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీను, అజహర్, సిద్దు , నాయకులు నాగోజి, అశోక్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి వెంకటయ్య, శేఖర్, జహీర్, శ్రీశైలం , కృష్ణ, అన్వర్ పాషా, ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ , ఉపాధ్యాయులు యాదయ్య, శేఖర్, పత్యా, చెన్నయ్య, పాఠశాల సిబ్బంది, గ్రామ యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.