విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

చందంపేట (జనం సాక్షి) జూన్ 11
స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక  ప్రాధాన్యత  ప్రాంగణాన్ని ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తున్నారని దేవరకొండ శాసన సభ్యులు  రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు శనివారం చందంపేట మండలం హాంక్య తండాలో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడామైదానాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం క్రీడామైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో,మైదానాలను పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆటలు ఆడి అందరిని ఆకట్టుకున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను మెరికల్లా తీర్చిసిద్ధేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇప్పించడంతో పాటుగా అవసరమైన ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో క్రీడల ప్రాధాన్యం పెరిగిందన్నారు.గ్రామీణ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అభిప్రాయపడ్డారు.దేవరకొండ నియోజకవర్గంలో నైపుణ్యమున్న క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు క్రీడాకారులకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అని ఆయన తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య,టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు యసాని రాజవర్ధన్ రెడ్డి రైతు బంధు అధ్యక్షులు  మంగమ్మ రమేష్ గోవింద్  మోహన్ కృష్ణ  అనంతగిరి  రామకృష్ణ  కృష్ణ శంకర్ నాయక్  తదితరులు పాల్గొన్నారు
Attachments area