విద్యార్థుల నుండి అక్రమ వసూళ్ళు ఆపివేయాలి
వేములవాడ, జూన్-26,: విద్యార్థులకు అవసరమైన టి.సి.లు ఇతరత్రా అవసరమైన పనుల కోసం వారి నుండి అక్రమ వసూళ్ళు చేయడం మానుకోవాలని వై.ఎస్.ఆర్.సి.పి. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కనికరపు రాకేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ కళాశాలలు కూడా టి.సి.లు ఇచ్చేటప్పుడు డబ్బులు వసూలు చేస్తు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాగా ఇకనైనా ఈ అక్రమ వసూళ్ళను ఆపివేయకుంటే తమ విద్యార్థి విభాగం తరపున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి.కార్యకర్తలు పోతుగంటి వెంకన్న, మకాశి కార్తీక్, పడిగెల మహేశ్, దమ్మయ్యగారి సాయితేజ, వేముల సంతోష్ గౌడ్, బూర్ల ప్రదీప్, తోట క్రాంతి కుమార్, ఎస్.కె. ఫెరోజ్, ఆకుల శ్రీనివాస్, పల్లి కార్తీక్, తోట దిలీప్, ముక్కెర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.