విద్యార్థుల రీయంబర్స్‌మెంట్ ఏది
రోడ్లెక్కకుండా ఉండాలంటే వెంటనే విడుదల చేయాలి
బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి
కరీంనగర్,నవంబర్ 2(జనంసాక్షి): తెలంగాణారాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల పీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల గురించి మాత్రం నోరు మెదపకపోవడంతో విద్యార్థులు తల్లడిల్లుతున్నారని బీసీ సంక్షేమ సంఘం వెల్లడించింది. తెలంగాణా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు, జిల్లా నేతలు సింహరాజు కోదండరామ్, విష్ణు, రణదీర్‌సింగ్, శ్రీనివాస్‌లతో కలిసి గురువారం స్థానిక ప్రెస్‌భవన్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు బీసీల తోపాటు అన్నివర్గాల వారికి వివిధ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నప్పటికి భావితరాలకు ప్రాతినిధ్యం వహించే విద్యార్థులకు సంబందిం చిన ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్ షిస్‌లు మంజూరు కాకపోవడంతో యాజమాన్యాలు విద్యాబ్యాసం పూర్తయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, దీంతో విద్యార్థులు నానా తంటాలు పడాల్సి వస్తుందన్నారు. వసతి గృహాల చార్జీలను 1200 నుంచి 1500కు, 360 రూపా యలున్న స్కాలర్‌షిప్‌ను 500కు పెంచడమేకాక 115 గురుకుల పాఠశాలలను బీసీలకు ఏర్పాటు చేసి ఎంతో మేలు చేశారన్నారు.సంక్షేమ వసతి గృహాల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం వల్ల మూడు పూటలా విద్యార్థులు కడుపు నిండా భోజనం చేస్తున్నారన్నారు. ఇన్ని చేసిన విూరు ఒక్క స్కాలర్ షిప్, ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు ఆపడం వల్ల ఇక్కట్లకు గురిచే స్తున్నారన్నారు. అంతేకాక విదేశాల్లో విద్యనభ్యసించేందుకు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా 20లక్షల వరకు సహాయాన్నిస్తున్నారని కొనియాడారు. కులవృత్తులు చేసుకునేవారికి, యువతకు కూడా విపరీతమైన సబ్సీడిలిచ్చి ఆదుకుంటున్నారని, కొత్తగా ఎంబిసి కార్పోరే షన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లను కేటాయించినప్పటికి బీసీల్లో ముఖ్యమైన స్థాయి అయిన విద్యార్థి దశలో కళాశాలలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ నిదులు విడుదల చేయక, స్కాలర్ షిప్‌లు కూడా విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయకపోవడంతో గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని, అలాగే స్కాలర్ షిప్ ల నిధులుకూడా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. గతంలో వైఎస్‌ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి పరోక్షంగా ఈ ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ పథకమే దోహద పడిందనేది వాస్తవమని
తెలంగాణా స్వరాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న అవస్థల ను పట్టించుకోకపోవడం బాదగా ఉందని ఇప్పటికైనా వెంటనే నిధులు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. విద్యార్థులను ఆందదోళన చేయకుండా నివారిస్తున్న ప్రభుత్వం వారి ప్రధాన సమస్య అయిన ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కాలర్ షిప్‌ల నిధులు విడుదల చేసి ఆదు కోవాలని,ఇది జరిగితే ఏ విద్యార్థి కూడా రోడ్డెక్కనే ఎక్కడని బీసీ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చింది. బాదను అర్థం చేసు కుని వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. అయినా స్పందించకపోతే ప్రతి కళాశాలనుంచి విద్యార్థుల చేత వ్యక్తిగతంగా ముఖ్య మంత్రికి లేఖలు రాయించి పంపిస్తామన్నారు.