విద్యుత్ కోతల్లో కొంత ఉపశమనం
శ్రీకాకుళం, జూన్ 12 : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కోతల వేళల్లో కొంత కనికరం చూపించింది. జిల్లా ప్రధాన కేంద్రం, మండల ప్రధాన కేంద్రాలు, మునిసిపల్ పట్టణాల్లో ఇప్పటి వరకు విధిస్తున్న విద్యుత్ కోతలను కాస్తా తగ్గించారు. ఈ మేరకు కార్పొరేట్ కార్యాలయం నుంచి ఇక్కడి ఎస్‌ఇ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. అయితే దీనికి అధనంగా ఇఎల్‌ఆర్ ఉంటుందని హెచ్చరిక జారీ చేశారు.