విద్యుత్‌ సంక్షోభానికి కారణాలు

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ సంక్షోభానికి కారణాలను విశ్లేషిస్తూ, ప్రత్యామ్నాయాలను కనుగొవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు ఏంపెల్ల భాస్కర్‌
మారతున్న ప్రపంచ పరిస్ధితులకు అనుగుణంగా మారిన ప్రజల జీవన విధానాల, ఆర్థిక పరిస్థితుల వలన కావచ్చు లేదా ప్రజలు ఆధారపడే ఆర్థిక రంగాల ప్రాధాన్యంలో సైతం నిత్యావసర వస్తువుగా మారింది. విద్యుత్‌ మీద ఆధారపడని రంగం, ప్రజలు దాదాపు లేరని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ విద్యుత్‌ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబ డింది. దాని భారం ప్రజల మీద పడింది. ఈ విద్యుత్‌ సంక్షోభానికి కారణాలను, పరిష్కారాలను, అవసరమయిన ప్రత్యామ్నాయలను చర్చించవలసిన అవసరం ఉంది. విద్యుత్‌ రంగంలో సంక్షోభం అంటే దాని అవసరానిక, సరఫరాకు మధ్య వ్యత్యాసాని, దాని మూలాన పెరిగిన విద్యుత్‌ ధరలకు, అవి ప్రజల రోజువారి జీవితంపై చూపిన ప్రభావానికి సంబంధించింది. మనం గమనించవలసింది విద్యుత్‌ కొరతకు దారితీసిన పరిస్థితు, విద్యుత్‌ ఉత్పత్తిని, ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అవి సమస్య పరిష్కారానికికంటే జటిలం కావడానికి దారిసీసిన విధానం.
భారత విద్యుత్‌ చట్టం – 2003
విద్యుత్‌ రంగంలో ప్రైవేటీకరణను తీసుకురావడం కోసం చేసింది ఈ విద్యుత్‌ చట్టం. భారతదేశంలో విద్యుత్‌ రంగంలో అనేక మార్పులను ఈ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం విద్యుత్‌ రంగం వివిధ విభాగాలుగా, ఉత్పత్తి, నియంత్రణ, పంపిణీ సంస్థలను వేరు వేరుగా ఏర్పాటు చేసుకొని వాటిద్వారా పనిచేయ డం తప్పనిసరి చేసింది. విద్యుత్‌ పరిశ్రమ ఏకీకృతం కాకుండా వివిధ విభాగాలుగా పనిచేయడం వలన దాని సామర్థ్యాంగాని, వినయోగదారులకు అందించిన సేవలలో నాణ్యతగాని పెరిగిన దాఖలాలు చాలా దేశాలలో లేవు. అయినా ఆత్పత్తి, నియంత్రణ, పంపిణీ విభాగాలు పనిచేయడం విద్యుత్‌ రంగం సామర్థ్యం పెంచు తుందని ఈచట్టం చెబుతుంది. విద్యుత్‌ రంగంలో ఉన్న అన్ని సమస్యలకు ఈ రకమైన వికేంద్రీకరణ, ప్రైవేటీకరణ పరిష్కారం అని సూచించింది. ఇందులో భాగంగానే విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీలో ప్రైవేట్‌ యాజమాన్యాలను అనుమతించింది. అయితే విద్యుత్‌ ఉత్పత్తిలో, పంపిణీలో వివిధ రాయితీలు అనుభస్తూ కూడా ప్రైవేట్‌ సంస్థలు సామాన్య ప్రజల అవసరాలు తీర్చడంలో సఫలమ యినట్టుగా మనకు ఎక్కడా కనిపించదు. చాలా సందర్బాల్లో ఈ ప్రైవేట్‌ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను ప్రజల అవసరా లకు, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా లాభా పేక్షతో ఎక్కువ ధర చెల్లించిన వారికే అమ్ముకుంటున్నట్లు గమనించవచ్చు. రిలయన్స్‌ కంపెనీ మన రాష్ట్రంలో ఉన్న వనరులను, కృష్ణా-గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌ను, రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంతో సతమవుతుంటే అవసరమైన గ్యాస్‌లో కొంత కూడా కేటాయించకుండా, అధిక ధర చెల్లించే రాష్ట్రాలకు అమ్ముకుంటోం ది. అలాగే ల్యాంకో వంటి ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలు, విద్యుత్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, లాభాలు దండుకోవడానికి ఎక్కువ ధరలు నిర్ణయిస్తూ పక్క రాష్ట్రాలకు అమ్యుకోవడం, పెద్ద వినియోగదార్లు పంపిణీ సంస్థలను నిర్ణయించుకునే అవకాశం ఈ చట్టం ఇవ్వడం వలన ఎక్కువ ధర చెల్లించే పెద్ద వినియోగదార్లకు అమ్యుకోవడం జరుగుతుంది. ఈ సంస్థల అధిపతులు కొన్ని సందర్బాల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్నా కూడా వాళ్లు ప్రజా ప్రయోజనాలకు కాకుండా లాభాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి విద్యుత్‌ రంగంను వికేంద్రీకరించి, ప్రైవేట్‌ పరం చేస్తే అందించే సేవలలో సామర్థ్యం, నాణ్యత పెరుగుతాయనడంలో వాస్తవం లేదు. ఒకవేళ పెరిగినా ప్రైవేట్‌ఉత్పత్తి సంస్థల ప్రయోజ నాలు, ప్రజల ప్రయోజనాలు ఒకటి కాదని అర్థం అవుతుంది.
ఇంథన సర్దుబాటు సర్‌ఛార్జ్‌ (ఎఫ్‌ఎస్‌ఎ):
విద్యుత్‌ ఛార్జిలు నిర్ణయించడానికి ముందు విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చులను, బొగ్గు, గ్యాస్‌, నాఫ్తా లాంటి ఇంధన వనరులకు అయ్యే ఖర్చులను ఆధారంగా చేసుకుని అంచనా వేస్తారు. భవిష్యత్‌లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ ఛార్జిలు నిర్ణయిస్తారు. అయితే ధరల్లో ముందుగా వేసిన అంచనా కన్నా ధరలు పెరగడం కానీ, తగ్గడం కానీ జరగితే, ప్రతి మూడు నెలలకోకసారి విద్యుత్‌ ఛార్జిలు సర్దుబాటు చేస్తారు. అంచనాకు మించి ఇంధన ధరలు పెరిగితే ఛార్జిలను తగ్గిస్తారు. ఇది అన్ని శ్లాబులకు వర్తిస్తుంది. ఇటీవలి విద్యుత్‌ ఛార్జిల పెంపుతో ప్రజలలో వచ్చిన వ్యతిరేకతకు భయపడి ప్రభుత్వం 850 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించింది. అయితే ఈ భారాన్ని ఇంధన సర్దుబాటు సర్‌ఛార్జిలన పెంచడం ద్వారా రాబట్టడం కోసం ప్రణాళి కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇట్లాంటి సర్దుబాటు చేయడానిక ఈ ఇంధన సర్దుబాటు సర్‌ఛార్జిలన ప్రభుత్వం ఉపయోగి ంచుకుంటుంది.
మర్చంట్‌ పవర్‌ ప్లాంట్‌
ప్రవైట్‌ రంగ సంస్థలు విద్యుత్‌ ప్లాంట్లను స్థాపించుకుని, ఉత్పత్తి చేసుకుని, ఇష్టం వచ్చిన ధరకు, ఇష్టం వచ్చిన వారికి, ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చు. వీటికి అవసరమయిన మౌలిక సదుపాయా లైన భూమి, నీరు మొదలైనవి ప్రభుత్వం సమకూర్చుతుంది. శ్రీకాకు ళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఈ ప్లాంట్లకు అనుమతి లభించింది. శ్రీకాకుళం జిల్లా కాకరపల్లి, సోంపేటలో ఏర్పాటు చేయనున్న ఇలాంటి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు విలువైన, సారవంతమైన భూములను ఇచ్చినందున ప్రజల జీవనాధారమైన చేపల వేటకు ఈ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు అడ్డుగా మారు తున్నందున ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎలు):
విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో కుదుర్చకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు దీర్ఘకాలికంగా ఇరవై ఐదు సంత్సరాలకు పైబడినవి. ఈ ఉత్పత్తి కేంద్రాలు ఎంత దర నిర్ణయించినా దీర్ఘకాలంలో కొనవలసి ఉంటుంది. వాటికి ఇంధన వనరులైన బొగ్గు, గ్యాస్‌ సమకూర్చవలసి ఉంటుంది. వాటికి ఇంధన వనరులైన బొగ్గు, గ్యాస్‌ సమకూర్చవలసిన బాద్యత సంస్థలకు కేటాయించకపోవడం వలన అధిక ధరలకు విదేశాల నుండి కొనుగోలు చేయడం
వీక్షణం సౌజన్యంతో ..