విద్యుత్ శాఖలో ఉదయించిన అవినీతి రవికిరణం.
ఆయన వలలో సన్నకారు రైతులు
– గిరివికాస్ లబ్ధిదారుల నుండి అధికంగా డబ్బులు వసూలు..
– ఇంకా 40 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్.
– అమాయక గిరిజనులను ముప్పు తిప్పలు పెడుతున్న అధికారి.
-సన్న, చిన్న కారు రైతుకు గొడ్డలి పెట్టులా మారిన అధికారి తీరు.
-విజిలెన్స్ అధికారుల చేతికి అవినీతి చిట్టా అందజేస్తామని లబ్ధిదారులు గగ్గోలు
పినపాక నియోజకవర్గం, జనంసాక్షి, ఆగష్టు 22:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు వ్యవసాయపరంగా ఆర్థిక పరిపుష్టి కలిగి సమాజంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఆదివాసీలకు, గిరిజనులకు “గిరి వికాస్ పథకం”పేరుతో ఒక మహత్తరమైన పథకాన్ని సన్న,చిన్నకారు ఆదివాసి రైతులకొరకు ప్రవేశపెట్టింది.కానీ తన అవినీతికి కాదేది అనర్హుహం అన్న చందాన మణుగూరు సబ్ డివిజన్, పినపాక విద్యుత్ శాఖలో ఓ అవినీతి రవికిరణం అవినీతి కాంతులు ఎదజల్లుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గిరి వికాస్ పథకం అమలు చేస్తుంటే,ఈ అవినీతి అధికారి లైన్ ఎస్టిమేషన్ ల వద్ద, ట్రాన్స్ఫారం బిగించే సమయాలలో తనపై ఉన్న అధికారులకు డబ్బులు ఇవ్వాలని, డబ్బుల కోసం అమాయక గిరిజన రైతులను వేధిస్తున్నాడని,కొందరు అమాయక గిరిజన రైతుల నుండి ఈయన తన ప్రైవేట్ సైన్యం ద్వారా 40 వేల రూపాయలు డబ్బులు తీసుకొని 90 శాతం మేరకు విద్యుత్ లైన్ పూర్తి చేశాడు.ఇంకా 40 వేలు ఇస్తే మిగిలిన 10 శాతం పని పూర్తి చేస్తాననీ భీష్మించు కూర్చున్నాడు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ అవినీతి రవికిరణం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పినపాక మండలం నుండే కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృధా చేశాడని సమాచారం. విజిలెన్స్ అధికారులు,
ఇటువంటి అవినీతి అధికారిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని ప్రజలందరూ కోరుతున్నారు.