విద్య రంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి.
టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్నతులు ,17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు లేక పాఠశాల విద్యా వ్యవస్థలు తీవ్రమైన సంక్షోబం లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో కారణంగా ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 26న బహిరంగ లేక, సెప్టెంబర్ 1న పెన్షన్ విగ్రహ దినం, సెప్టెంబర్ 4న జిల్లా కేంద్రంలో సామూహిక నిరాహార దీక్షలు, సెప్టెంబర్ 11న హైదరాబాదులో నిరోధిక రిలే దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అంబటి రమేష్, ఎలగొండ రవి, నారాయణ, నజీరుద్దీన్ పాల్గొన్నారు.