విధుల్లో చేరిన కలెక్టర్
శ్రీకాకుళం, జూన్ 12 : జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి మంగళవారం యథావిథిగా విధులకు హాజరయ్యారు. వైఎస్ జగన్ అక్రమాస్తులకేసుకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని సీబీఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. నరసన్నపేట ఎన్నికల దృష్ట్యా వెంటనే బయలుదేరి జిల్లాకు చేరుకున్న ఆయన మంగళవారం యథావిధిగా విధుల్లోకి చేరారు.