వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుని యువకులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఎస్సై కోకుల్లా శ్వేత పెగడపల్లి 

పెగడపల్లి  (జనం సాక్షి )ఆగస్టు 28 పెగడపల్లి  మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పెగడపల్లి  పోలీస్ పర్మిషన్ అనుమతి రిసిప్ట్ పొందగలరని ఎస్సై శ్వేత  కోరారు. తేదీ 31/08/2022 న నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల దగ్గర పోలీసు వారి ఆదేశాలు పాటించాలని లేనియెడల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అట్టి మండపం నిర్వాహకులే దానికి బాధ్యులు గా పరిగణించబడతారని అదేవిధంగా తప్పనిసరిగా మండపాలలో ఎలాంటి డీజే సౌండ్లకు అనుమతి లేదని కేవలం సౌండ్ బాక్స్ లు మాత్రమే వినియోగించుకోవాలని ఒకవేళ డిజె సౌండ్లు పెట్టినచో వారిపై కేసు నమోదు చేయబడుతుందని ఎస్సై శ్వేత , తెలిపారు. తప్పనిసరిగా మండపాల దగ్గర రాత్రి వేళలో ఐదు మంది యువకులు విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గనే ఉండాలని ఎస్సై  తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన, https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా  దరఖాస్తు చేసుకోవాలని అలా అప్లై చేసి డౌన్లోడ్ చేసుకున్న ఒక కాపీని పోలీస్ స్టేషన్లో సమర్పించాలని మరొక కాపీని మండపం దగ్గర ఉంచాలని సంబంధిత అధికారులు తనిఖీ చేయడానికి వస్తే పార్టీ దరఖాస్తు చేసుకున్న కాపీని చూపించాలని ఎస్సై శ్వేత  తెలిపారు.