విపక్షాల తీరు మారాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చీఫ్‌విప్‌,ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇతర రాష్టాల్రు తెలంగాణ వైపుకు చూడటం మనం గమనించాల్సిన అంశం అన్నారు. రైతులకు కొత్త ఏడాదిలో 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంటు సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో రాష్టాన్రి అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు సహకరించి, మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయని అన్నారు. దీంతో ప్రాజెక్టులను, ఉద్యోగ నియామకాల్ని , ప్యాక్టరీలను రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడటం ఎంతవరు సమంజసమని అన్నారు. ఇటువంటి చర్యలతో ప్రతిపక్షాలు ప్రజలకు మరింత దూరమవుతున్నారన్నారు.