విపక్షాల విమర్శలను తిప్పికొట్టండి

C

– పొలిట్‌ బ్యూరో రాష్ట్ర కమిటీల ఏర్పాటు

– నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టండి

– టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి):

జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలను సవిూక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. ఇకపోతే విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పి కొట్టాలని సిఎం సూచించారు. రైతు ఆత్మహత్యలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్దంగా తిప్పి కొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.విపక్షాలు కావాలని దుష్పచ్రారం చేస్తున్నాయని,ఈ విషయాన్ని జనంలోకి తీసుకుని వెళ్లాలని ,ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చేస్తున్న పనులను తెలియచేయాలని ఆయన కోరారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడరాదని, ఎవరైనా దురదృష్టవశాత్తు చేసుకుంటే , వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. దసరా తర్వాత తాను కూడా జిల్లాలలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. నామినేటెడ్‌ పదవులు కూడా దసరా లోపు ఇస్తామని కెసిఆర్‌ చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్‌ ఐడిహెచ్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు చూసి రావాలని ఎమ్మెల్యేలను కెసిఆర్‌ కోరారు.టిఆర్‌ఎస్‌  అభివృద్ధికోసం కష్టపడి పనిచేసే వారికి జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. రాష్ట్ర కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర,

జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు  నాయిని తెలిపారు. పాత, కొత్తవారిని కలుపుకొని పార్టీని పటిష్టం చేయాలని సీఎం సూచించారు. పరిమిత సభ్యులతో పొలిట్‌బ్యూరో ఏర్పాటు. అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఉండేలా రాష్ట్ర కమిటీ ఏర్పాటు దసరాలోపు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీకోసం కష్టపడ్డ వారిని ఎవ్వరినీ మరువమని, వారి సేవలను ఉపయోగించుకుంటామని అన్నారు. సంక్షేమ పథకాలను నిరంతరం సవిూక్షించాలని ప్రజా ప్రతినిధులను సీఎం ఆదేశించారు. పెన్షన్లు, రేషన్‌ కార్డులు లేనివారికి వెంటనే అవి అందిలా నేతలు చొరవ తీసుకోవాలి. రెండో విడత మిషన్‌ కాకతీయలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని విజయవంతం చేయాలి. ప్రతి నియోజకవర్గంలో పనులు సక్రమంగా జరిగేలా చూడాలి. ఇంటింటికీ మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్‌ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులను ప్రజా ప్రతినిధులు ఎప్పటికిప్పుడు పర్యవేక్షిస్తూ రెండు మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించినట్లు నాయిని పేర్కొన్నారు. ఇదిలావుంటే దసరా నుంచి రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం దసరా నుంచి ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. దేవాలయాలు, గ్రంథాలయాలు, మార్కెటింగ్‌ తదితర కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. పరిపాలన సజావుగా సాగేలా మంత్రులు చూసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాల్సిందిగా కోరారు. దసరాలోపు పార్టీ కమిటీలు, నామినేటెడ్‌ పదవుల భర్తీ జరుగుతదని దసరా తర్వాత జిల్లాల్లో పర్యటిస్తామని సీఎం పేర్కొన్నారు.