విమలక్క అరెస్టు
సిరిసిల్ల టౌన్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ చేనేత దీక్షను అడ్డుకోవటానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రజాఫ్రంట్ చైర్మన్ విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో విజయమ్మ అడుగుపెట్టారాదని వారు నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిపై లాఠీ చార్జి చేసి అరెస్టు చేశారు.