విశాఖ`ముంబై గంజాయి అక్రమరవాణా


` హైదరాబాద్‌లో పట్టివేత
` ట్రావెల్‌ ఏజెంట్ల గంజాయి రవాణా వ్యాపారం
` వివరాలు వెల్లడిరచిన సిపి మహేశ్‌ భగవత్‌
హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి): రాచకొండ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్‌ఒటి పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ సమాచారంతో గంజాయి ముఠాను పట్టుకున్నామని రాచకొండ సిపి మహేష్‌ భగవత్‌ వెల్లడిరచారు. గంజాయి విలువ దాదాపుగా రూ.2.8 కోట్లుగా ఉంటుందని, డ్రగ్స్‌ తరలింపు కేసులు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. ఫిరోజ్‌ పాటు మరో ఇద్దరు డ్రైవర్లు పరారీలో ఉన్నారన్నారు. మూడు వాహనాలు, ఐదు వేల రూపాయలు, ఆరు ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ ను సీజ్‌ చేశామన్నారు. నిందితులపై ఎన్‌ డిపిఎస్‌, పిడి యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశామని సిపి మహేష్‌ భగవత్‌ వెల్లడిరచారు. నిందితుల నుంచి 1240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నది. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి మూడు కార్లను సీజ్‌ చేశారు. విశాఖపట్నం సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు. కరోనా టైమ్‌లో ట్రావెల్‌ఓ పనిచేస్తున్న వీరు కత్త వ్యాపారానికి తెరతీసారని అన్నారు. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇన్నోవా,టాటా వాహనాలలో గంజాయి ని తరలిస్తుండగా అరెస్ట్‌ చేశామని పోలీసులు అన్నారు.ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసామని..మరో ముగ్గురు పరారీలో ఉన్నారని  వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. ప్రధాన నిందితుడు షేక్‌ యాసిన్‌ అలియాస్‌ ఫీరోజ్‌ ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతూ ఈ దందా చేస్తున్నట్లు  చెప్పారు. ప్రస్తుతం ఫిరోజ్‌ తో పాటు ఇద్దరు డ్రైవర్లు రవీందర్‌,మధు పరారీలో ఉన్నారు.నిందితుల దగ్గర  నుండి 3 వాహనాలు, నగదు 5 వేలు, మొబైల్స్‌ 2, ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ 6 సీజ్‌ చేసామన్నారు.  నిందితుల పైన పిడి యాక్ట్‌తో పాటు పిడీ యాక్ట్‌ కూడా నమోదు చేస్తామన్నారు.