విస్తృతంగా బడిబాట కార్యక్రమం
ఎల్లారెడ్డిపేట జూన్ 05, (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలలో మంగళవారం మండల విద్యాదికారితో పాటు ప్రభుత్వ పాఠశాలల ప్రదానోపాద్యాయులు, ఉపాద్యాయులు ఇంటింటికి తిరిగి బడిబాటా కార్యాక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసుతులను తెలుపుతున్నారు. అంతే కాకుండా మండల విద్యాదికారి విద్యార్థుల తల్లిదండ్రులకు, తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామిఇస్తున్నారు. అంతే కాకుండా మండల విద్యాదికారి వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల తండాలలో గల గిరిజనుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తే అప్పులు అవడం జరుగుతుందని అదే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే నాణ్యమైన విద్య అందుతుందని లొద్దితాండ, బావుసింగ్‌తాండ, రాశిగుట్టతాండలతో పాటు గర్జనపల్లి గ్రామంలోని తండాలో జరుగుతున్న ఉపాదిహామి పనుల వద్దకు ఎంఈఓ రాజయ్యతో పాటు ఆయా పాఠశాలల ఉపాద్యాయుల వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అదే విధంగా ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి , కిషన్‌దాస్‌పేట, బొప్పాపూర్ గ్రామాలలో గల విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. గత 4రోజులుగా బడిబాట కార్యక్రమం నిర్వహించగా రెండు మండలలోని ప్రభుత్వ పాఠశాలలో 393మంది విద్యార్థులు నూతనంగా ప్రవేశం పొందారని మండల విద్యాదికారి మంకు రాజయ్య తెలిపారు.