వృత్తివిద్యపై అవగాహన అవసరం
కడప, జూలై 11 : జీవనోపాధిని మెరుగుపర్చుకునేందుకు వృత్తివిద్యపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త స్వర్ణలత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్న వారు ఏదో ఒక పని చేస్తే తప్ప జీవనం సక్రమంగా సాగదని ఒక ప్రకటనలో చెప్పారు. కుటుంబ జీవన విధానం మెరుగుపడేందుకు వృత్తివిద్య ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు బ్యూటీషియన్ కోర్సుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ కోర్సుపై శిక్షణ ఇస్తామని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.