వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సూర్యాపేట (జనంసాక్షి): ప్రతి ఒక్కరూ వెదురుతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా వాటిని తయారు చేసే మేదర కులస్తులకు ఉపాధి కల్పించిన వారమవుతామని ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ , మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల ప్రదర్శనను వారు ప్రారంభించి మాట్లాడారు. మేదర కుల సంఘ భవనం కొరకు స్ధలం కేటాయించడంపై మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడతామని చెప్పారు.మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అన్ని కుల వృత్తులను ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు.హరితహారం కార్యక్రమంలో వెదురు చెట్ల పెంపకానికి కృషి చేస్తామని చెప్పారు.ప్లాస్టిక్ కు బదులుగా ప్రజలు వెదురు ఉత్పత్తులు వాడి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ , జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మేదర సంఘం జిల్లా నాయకులు సులువ యాదగిరి, కోన మల్లయ్య , కల్లూరి తిరపతయ్య , శేర్ల వెంకన్న , నోముల మల్లేషం , కల్లూరి వెంకన్న , కల్లూరి మురళీకృష్ణ , కల్లూరి అజయ్ , కోన హిమతేజ్ , పిల్లి శివశంకర్ , సులువ చంద్రశేఖర్ , నోముల మల్లేషం, కోన ఆండాలు , నోముల రాధ , కల్లూరి పుష్పలత , సులువ నాగలక్ష్మి , కల్లూరి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.