వెలిచాలలో ఉచిత వైద్య శిబిరం
రామడుగు, జూలై 21 (జనంసాక్షి): వెలిచాల గ్రామంలోని ఉన్నత పాఠశా లలో ‘ఆరోగ్య వికాస’ వారు కంటి, పంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చిన ఈ కార్యమ్రానికి జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు వీర్ల ప్రభాక ర్రావు ముఖ్య అథితిగా హాజర య్యారు. ఈ వైద్య శిబిరానికి వెలిచాల, గుడివెలుగుపల్లి, క్రిష్టారావు పల్లి ప్రాథమిక పాఠశాల విద్యా ర్థులకు డెంటల్ డాక్టర్ రమ్య, కంటి డాక్టర్ నరసింహస్వామిల వైద్య బృం దం వారు పరీక్షలు నిర్వహించారు. ఆనంతరం వీర్ల ప్రభాకర్‌రావు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్కేల్లు పంపిణీ చేశారు. పాఠశాల స్టేజి నిర్మాణం కోసం అయ్యే ఖర్చును ప్రభాకర్‌రావు విరాళంగా అందజేశారు. వారు మాట్లాడుతూ తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తేనే జీవితంలో ఉన్నత స్థానంలోకి నిలబడాతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యయులు కిషన్‌రెడ్డి, వీర్లప్రభాకర్రావు, ఎంఈవో స్వామి, డాక్టర్ రమ్య, డాక్టర్ నరంహస్వామి, ప్రేవమ్ చందర్, శంకర్, పద్మ, మాధవి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.