వేదవ్యాస పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

వెంకటాపూర్(రామప్ప),
ఆగస్ట్19(జనం సాక్షి):-

ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రము లోని
వేదవ్యాస ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. చిన్నారులు గోపికమ్మ, కృష్ణుని వేషధారణలో పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థినీ విద్యార్థులు కోలాటాలు, నృత్యాలు చేశారు.చిన్ని కృష్ణుని వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది.ఈకార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ పోశాల వీరమల్లు,సూర్య ప్రకాష్,రాజయ్య, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.