వేములవాడలో శ్రావణ రద్దీ
రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్13(జనం సాక్షి ): శ్రావణమాసం కావడంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ తొలి సోమవారం సందర్భంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం కల్యాణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తారు. మండపంలో మహా లింగార్చన చేసేందుకు, శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయ సిబ్బంది చెప్పారు. సోమవారం సాధారణంగానే రద్దీ ఉంటుంది. శ్రావణమాసం తోడు కావడంతో వేలాదిగా భక్తులు వచ్చారు. అమ్మవారిక కుంకుమార్చనలు చేపట్టారు. అలాగే కోడె మొక్కులు తీర్చుకున్నారు.