వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య

సిరిసిల్ల రాజన్న,జూన్‌19(జ‌నం సాక్షి): జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాకలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థిని మౌనిక(16) ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కాపేటలో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉండే ఎల్లంకి శ్రీనివాస్‌(45), ఎల్లంకి పద్మ(42) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.