వైద్యం చేయించుకునే స్థోమతలేక నేత కార్మికుని మృతి
కరీంనగర్: సిరిసిల్లలో స్థానిక సుందరయ్యనగర్‌కు చెందిన నేత కార్మికుడు రాజమౌలి అప్పుల బాధ భరించలేక కిడ్ని అమ్ముకున్నాడు. తద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు. అయితే కొన్ని రోజుల అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య చికిత్సలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవటం మరోవైపు విద్యుత్ కోతలతో వూర్లో పని లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు ఈ రోజు ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.