వ్యవసాయంలో ఉన్న ఆనందం.ఏ వృత్తిలో ఉండదు

– మా నాన్న స్వయాన రైతు 
– రైతులంటే ఆయనకెంతో గౌరవం
– అందుకే రైతులకోసం అద్భుత పథకాలు తెస్తున్నారు
– రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
– రైతుబంధు పథకం అద్భుతమైనది
– అన్నదాత కష్టాలు తీర్చేందుకే ఈ పథకం
– రైతుబంధు పథకంపై అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్‌
సిరిసిల్ల, మే3(జ‌నం సాక్షి) : వ్యవసాయంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని చెప్పారు. సిరిసిల్లలో రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. అందుకోసం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. మానాన్న స్వయాన రైతు అని, రైతులు పంటల సాగులో ఎదురయ్యే ఇబ్బందులన్నీ ఆయనకు తెలుసన్నారు. ముఖ్యంగా రైతులంటే ఆయనకెంతో గౌరవమని, రైతులను రాజులుగా చూడాలన్నదే ఆయన కోరిక అని అన్నారు. అందుకే కేసీఆర్‌ రైతుల కోసం నిత్యం ఏదో ఒక పథకం తెస్తున్నాడని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలని రైతు సమన్వయ సమితులు తెచ్చారని, రైతులు పంటల ఆరంభంలో డబ్బులు లేక వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు చుట్టూ తిరిగి అప్పులు చేస్తున్నారని, మళ్లీ పంటలు దెబ్బతిని వాటిని తీర్చలేక నలిగిపోతున్నారని అన్నారు. దీనిని గుర్తించిన కేసీఆర్‌ రైతులకు పంటల సాగు ప్రారంభంలో ఖరీఫ్‌, రబీల్లో ఎకరాకు 4వేల చొప్పున అందించేందుకు రైతుబంధు పథకం తెచ్చారని అన్నారు. ఈ పథకం అద్భుతమైన పథకమని, రైతులకు ఎంతో మేలు చేసే పథకమన్నారు. అంతేకాకుండా  5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ
విస్తరణాధికారిని నియమించినట్లు తెలిపారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరముందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లలో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మించినట్లు పేర్కొన్నారు. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నరు. ప్రాజెక్టులు కడుతుంటే..రైతులకు సాయం చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు అడ్డుపడుతున్నరని కేటీఆర్‌ మండిపడ్డారు. వారిని తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత విూదేనని పిలుపునిచ్చారు.
————————————–