వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య
ఖానాపూర్ రూరల్ 21 ఆగష్టు (జనం సాక్షి): వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖానాపూర్ మండలం లోని సతనపెల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ఎసై రజినీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఏనుగుల సుజాత 45 నెల రోజుల నుండి మతిస్థిమితం లేకుండా తిరుగుతుందని.ఈ క్రమంలోనే శనివారం రాత్రి సతన పెల్లి కి చెందిన జక్కుల నడిపి బిమన్న కు చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది ఇలా ఉండగా మహిళ భర్త 20 సంవత్సరాల క్రితమే చనిపోగా,ఉన్న ఒక్క కూతురి వివాహం మూడు సంవత్సరాల క్రింద చేసిందని,మృతురాలి తమ్ముడు బీమ్మన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రజినీకాంత్ తెలిపారు.