వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు
జిల్లా వైద్యాధికారి జైపాల్‌రెడ్డి
జగిత్యాల,జూలై19(జనం సాక్షి): వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు చేపట్టామని జిల్లా వైద్యధికారి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తసీఉకుని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు. గ్రామాల్లో ప్రజలు పారిశుద్యం పాటిస్తేనే వ్యాధులకు దూరంగా ఉండగలరని అన్నారు.అంటు వ్యాధులు, జ్వరాలు ప్రబలినప్పుడు ప్రత్యేకంగా రాఫిడ్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసుకొని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ , ఐసీడీఎస్, మెడికల్ ఆండ్ హెల్త్ శాఖల అధికార సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం ప్రసవాలు జరిగేలా సూపర్వైజర్లు, ఎఎన్ఎంలు కృష చేయాలన్నారు. గర్బిణీలు, ప్రసవాలకు ఆసుపత్రికి వచ్చే మహిళలకు 102 వాహన సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.