వ్యాపారులకు పోలీసుల అవగాహన సదస్సు
పెద్దపల్లి,జూన్25(జనంసాక్షి) :
18సం,లోపు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మడం చట్టరిత్య నేరమని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కిరా ణ,పాన్‌షాప్‌ల వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక వెల వ్యాపారులు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మితే వారిపై చట్టరిత్య కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. దీనికై ప్రతి వ్యాపారి తన షాపులో పొగాక అమ్మరాదని ఒకపోస్టర్ పెట్టుకోవాలని ఆయన తెలిపారు.డాక్టర్ కిరణ్ కుమార్ పొగాకు సంబం ధించిన వాటిని తాగడం వల్ల కలిగే నష్టాలను వ్యాపారులకు వివరించారు. ఈకార్యక్రమంలో సీఐకిరణ్‌కుమార్, ఎస్సైరాజేంద్రప్రసాద్,పట్టణ వ్యాపారులు పాల్గొన్నారు.