
బోధన్, జూలై 31 (జనంసాక్షి ) : బోధన్ పట్టణంలోని ఏక చక్ర శివాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పట్టణంలోని ఉషోదయ కళాశాల డైరక్టర్ దుష్యంత్ సీసీ కెమెరాలను అందించారు. ఆలయంలోని ప్రధాన ప్రాంతంలో, ఇతర ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఉషోదయ కళాశాల డైరక్టర్ దుష్యంత్ 8 సీసీ కెమెరాలను అందించారు. వీటి విలువ సుమారు 50 వేల వరకు ఉంటుందని ఆలయ కమిటీ ఛైర్మెన్ పాల్వార్ సాయినాథ్, ఆలయ ఈవో వేణుగోపాల్ వివరించారు.ఈ కార్యక్రమములో భక్తులు పాల్గొన్నారు.