శేరిలింగంపల్లిలో మూడు రోజులపాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15( జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుమేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుందని, ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పరిధిలోసైతం జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు గురువారం మియాపూర్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పీజేఆర్ స్టేడియం వరకు శుక్రవారం ఉదయం విద్యార్థులు, యువతి, యువకులు, మహిళలతో కలిసి భారీ ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా ప్రారంభ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొత్తం మూడు రోజులపాటు 16, 17, 18 తేదీలలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయన్నారు. ప్రభుత్వ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని శేరిలింగంపల్లి టిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు గాంధీ పిలుపునిచ్చారు. కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈనెల 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఔత్సాహికుల చేత కొనసాగింపబడతాయని గాంధీ వివరించారు. సెప్టెంబర్ 18న స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించడం జరుగుతుందని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, మల్లేష్ గుప్తా,కృష్ణ యాదవ్, MD ఇబ్రహీం, రమేష్,వరలక్ష్మి రెడ్డి, కార్తిక్ గౌడ్, దాస్, నరేందర్ బల్లా, యశ్వంత్, అమిత్ దూబే, సందీప్ రెడ్డి శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, SRP లు శ్రీనివాస్ రెడ్డి, మహేష్, కనకరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Attachments area