శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేసిన దానం
హైదారాబాద్: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ బుధవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మేడే ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ‘కార్మిక కిరణాలు’ పుస్తకంతో పాటు ‘శ్రమ కిరణాలు’ ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం శ్రమశక్తి అవార్డులను దానం ప్రదానం చేశారు. గత మూడేళ్లుగా జరుగని మేడే ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయని దానం తెలిపారు. కార్మిక భవన్‌ను ఏర్పాటు చేస్తామని దానం ప్రకటించారు. కార్మికుల పిల్లల ఉన్నత విద్య కోసం లక్షల రూపాయల ఆర్థిక సహయం అందిస్తామన్నారు.