శ్రీ నారాయణ హై స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ నారాయణ హై స్కూల్ లో శుక్రవారం నాడు కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిన్నారులతో కృష్ణుని వేషం,గోపికలుగా వేషాలు వేయించి నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాయి.అనంతరం ఉట్టిని పైకి కట్టి విద్యార్థులు ఒకరిపై ఒకరు నిలబడి ఉట్టిని పగులగొట్టి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లు ప్రసాద్,ప్రవీణ్ ఉపాద్యాయులు ప్రకాష్,శ్రీనివాస్, కీర్తి,వరలక్ష్మీ, మహేశ్వరి,కవిత పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.