శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ఇంటింటికి జాతీయ జెండాలను అందజేసిన నాగేశ్వరరావు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 12
అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షులు బి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశానుసారం  కాలనీ లో ఇంటి ఇంటికి జాతీయజెండాల పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటిపై తప్పని సరిగా మువ్వన్నెల జెండా రెపరెపలాడలన్నారు. జాతీయ జెండా గురించి మనము పాటించవలసిన నిబంధనలు తెలియచేసి15 వ ఆగష్టు ను జెండా పండగను కాలనీ లో ఉత్సాహ వంతంగా జరుపుకోవాలని,ఎందరో మహాత్ముల త్యాగ ఫలితమే ఈనాడు మనం ఇంత సంతోషంగా ఉన్నామని తెలిపారు.75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్న పండుగలొ మనం భాగస్వాములుగా కావడం మన అదృష్టం అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి కాలనీ కమిటీ మెంబర్స్ నారాయణ, ఆంటోనీ, స్వామి, జైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, దుర్గాప్రసాద్, నాగన్న, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.