శ్రీ వివేకవర్ధినిలో మట్టి వినాయకుల పంపిణీ

కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి / మండలంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో మంగళవారం విద్యార్థులకు మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ… రకరకాల రంగులతో మరియు పర్యావరణానికి హాని చేసే పదార్థాలతో వినాయకుని ప్రతిమలను తయారుచేసి ఉపయోగించడం వల్ల ప్రకృతి కలుషితమవుతుందన్నారు.మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలను ఉపయోగించడం ద్వారా
ఆర్దిక భారం పడకుండా మరియు పర్యావరణ కాలుష్యం జరగకుండా చూడవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి తో తయారుచేసిన విగ్రహాలను వాడే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు