షరతులు లేకుండా రైతుకు బీమా కల్పించాలి –
హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): పట్టకలిగివున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమాను జున్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినొత్సవం రొజున రైతులకు,కౌలు చెసె రైతులకు వయస్సుతొ ఎలాంటి షరతులు లేకుండా భీమా సౌకర్యం కల్పించాలని భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు హుస్నాబాద్ పట్టణంలో అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో శనివారం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి వయస్సుతొ మరణంతో సంబంధం లేకుండా ఐదు లక్షల ఎక్స్ గ్రెసియా ఇచ్చి రైతులను ఆదుకోవాలని గడిపె మల్లేశ్ అన్నారు, 500 వందల కొట్లా రుపాయలతొ రైతు సమన్వయ సమితి కి, కెటాయిస్తామని గొప్పలుచెప్పి ఆర్బాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్, విధి విధానాలను నిర్ణయించుటకు రైతులకు పరిహారం చెల్లించేందుకు భీమా సంస్థలతొ టైయాఫ్ చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్, తిరాచుస్తె భీమా సంస్థలు వయస్సు నిబంధనలు, రైతు మరణం ఎలా జరిగిందిఅని నిర్ధారణ చేస్తారు అనిచెప్పడం పట్లా సిపిఐ నిరసన వ్యక్తంచేస్తుంది, 59 సంవత్సరాలు పైబడిన రైతులకు వ్యవసాయం చెయద్దా, అట్టి రైతులకుటుంబాలు నష్ట పొవసిందెనాఅని ముఖ్యమంత్రిని సిపిఐ అడుగు తుంది, నామమాత్రపు ప్రీమియం చెల్లింపు చేయలేని స్తొమత రైతులకు లేదను కుంటున్నారా ముఖ్యమంత్రి కెసిఆర్, వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్న రైతులకు, కౌలు రైతులకు, వయస్సుతొ సంబంధం లేకుండా ఎలాంటి మరణం చెందిన గాని రైతన్నలకు అంక్షాలు లేకుండా రైతు సమన్వయ సమితి ద్వారా నే రైతులకు ఐదు లక్షలా నష్ట పరిహారం చెల్లించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాది లేకుంటే టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పై రాష్ట్ర వ్యాప్తంగా ఆదొళనలు చెపడుతామని గడిపె మల్లేశ్ అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల బాలమల్లు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ననువాల ప్రతాప్ రెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుర్రాల హన్మిరెడ్డి, సముద్రాల తిరుపతి పాల్గొన్నారు