షోయబుల్లాఖాన్‌ నేటి తరం జర్నలిస్ట్‌లకు మార్గదర్శి

కరీంనగర్: షోయబుల్లాఖాన్‌ వర్ధంతి సంధర్భంగా ఈ రోజు స్థానిక తెలంగాణ జాగృతి కార్యలయంలో తెంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జిల్లా కన్వీనర్‌ తానిపర్తి తిరుపతిరావు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో పత్రికా స్వేచ్చకోసం ప్రాణాలొదిలిన వీరుడని రజకారు సైన్యాల అరాచకాలను అక్షరమక్షరం లిఖించిన హైదరాబాదని తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినాగాని, పీడిత ప్రఝల పక్షాన అక్షరమే ఆయుధంగా నిలిచి భావ ప్రకటన స్వేచ్చకోసం అమరుడయ్యాడని మొదటగా ‘రయ్యత్‌’ పత్రికలో సహాయక సంపాదాకుడిగా చేరీ తర్వాత ‘ఇమ్రోజ్‌’ అనే సోంత పత్రికను పెట్టాడు. ఇమ్రోజ్‌ అంటే అర్థం నిప్పుకణం. పత్రికా పేరులాగే అందులోని అక్షరాలన్ని దోపిడి దారులకు సెగలు తాకాయని, రజకార్ల 28ఏళ్ల వయసులోనే హత్యకు గురైన యువ పత్రిక రచయిత దీక్షదోతలు, అసామన్య సాహాసం నేటి తరం జర్నలిస్టులకు మార్గదర్శకం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడ ఇమ్రాన్‌ అహ్మద్‌, పసులచరణ్‌, పులగం మల్లేశం, అశోక్‌, రమేశ్‌, యల్లయ్య, మల్లేశం, శరత్‌ పాల్గొన్నారు.

తాజావార్తలు