సంక్షేమంలో మనమే నంబర్‌ 1

C

– మార్చి నాటికి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌

– జలహారం కల సాకారం చేస్తాం

– గ్రామజ్యోకి మహాత్ముడే స్ఫూర్తి

– తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తాం

– గోల్కొండ కోటనుంచి సీఎం కేసీఆర్‌ ప్రసంగం

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జనంసాక్షి):

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వారి అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని,  దేశంలో సంక్షేంలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉన్నదని, అందుకు చేపట్టిన పథకాలే నిదర్శనమని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇంటింటికీ నీళ్లు అందించేందుకు ఉద్దేశించిన జలహారం కల సాకారం చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 69వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ నగరంలోని చారిత్రక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు  సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లోని జరిగిన వేడుకలో సీఎం పాల్గొని అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  సమైక్య పాలనలో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రాజెక్టులపై బృహత్‌ ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్ముడు కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం గ్రామజ్యోతి పథకంతో ముందుకు పోతున్నామని కెసిఆర్‌ అన్నారు. అనంతరం ప్రభుత్వ పాలనపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మొదటి పంద్రాగాస్టు వేడుకల నాటికి తెలంగాణ పసిబిడ్డ. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలా నష్టపోయింది. పలురంగాల్లో ప్రణాళికలు వేసుకుని విజయవంతంగా ముందుకువెళ్తున్నం. నీటిపారుదల, విద్యుత్‌, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తున్నామని వివరించాం.  తెలంగాణలో రైతులకు ఇంతవరకు ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర రుణాలు మాఫీ కింద ఖర్చు చేశామని కెసిఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు ఏర్పడతాయని కొందరు ప్రచారం చేశారని కాని అది వాస్తవం కాదని రుజువు చేశామని, కరెంటు కష్టాలు లేకుండా,కోతలు లేకుండా చేశామని ఆయన తెలిపారు. మిషన్‌ కాకతీయకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని, ఇటీవలే హైకోర్టు కూడా దీనిని మెచ్చుకుందని. మిచిగాన్‌ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా చేశారని  ఆయన అన్నారు. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్‌ వరంగల్‌ జిల్లా నెక్కొండ గ్రామ చెరువు వద్ద జన్మదినం జరుపుకున్నారంటేనే ఆ కార్యక్రమానికి ఎంత గుర్తింపు వచ్చిందో తెలుసుకోవచ్చని అన్నారు. మిషన్‌ కాకతీయ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఏటా 9వేల చెరువులకు మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. పారిశ్రామిక విధానంలో సింగిల్‌ విండో సిస్టమ్‌ పెట్టామని దీనిని పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు కూడ అభినందించిందని కెసిఆర్‌ తెలిపారు. ఇప్పటివరకు ముప్పై ఆరు పరిశ్రమలకు దీనికింద అనుమతులు ఇచ్చామని ఆయన చెప్పారు.  పరిశ్రమల ఏర్పాటుకు లక్షా50వేల ఎకరాల భూమిని పరిశ్రమలశాఖకు కేటాయించామన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నీటిపారుదల, విద్యుత్‌, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధించామన్నారు. సంక్షేమ రంగానికి బ్జడెట్‌లో 28వేల కోట్లు కేటాయించామని తెలిపారు. రుణమాఫీ కింద రైతులకు 2 విడతల్లో రూ.8,500 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ధరల స్థిరీకరణకు రూ.400 కోట్లు కేటాయించామని చెప్పారు.ప్రజలముందుకు త్వరలో బృహత్‌ నీటిపారుదల పథకాన్ని తీసుకురానున్నట్లు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కోతలు లేని విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.మార్చి నాటికి రైతులకు 9 గంటల విద్యుత్‌ అందజేస్తామని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఇటీవల జరిగిన గోదావరి మహాపుష్కరాలకు ఘనంగా నిర్వహించామని కేసీఆర్‌ పేర్కొన్నారు.వచ్చే ఏడాది రానున్న కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ తాగునీటి సమస్య పరిష్కారం కోసం 30 టీఎంసీల రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. ఇంటింటికీ నీళ్లు అందించేందుకు ఉద్దేశించిన ‘జలహారం’ కల సాకారం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో తాగునీటి కోసం ఉత్తర, దక్షిణ భాగాల్లో 30 టీఎంసీల సామర్థ్యంతో 2 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. సమైక్య పాలనలో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. 1.42 కోట్ల జనాభా గల హైదరాబాద్‌లో ఒక్క రిజర్వాయర్‌ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టులపై బృహత్‌ ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు.పోలీసుశాఖలో సంస్కరణలు చేపట్టాం. పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయస్థాయిలో సెంట్రల్‌ కమాండింగ్‌ సిస్టంతో శాంతి భద్రతల పర్యవేక్షణ. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నం. జీవో 50 కింద లక్షా 25 వేల మంది పేదలకు ఉచితంగా భూమి పట్టాలిచ్చాం. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మాగాంధీ అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామజ్యోతి శ్రీకారం చుట్టినం. గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులతో పాటు యువకులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

25వేల కోట్లతో గ్రామాల అభివృద్ధి

ప్రణాళికాబద్దంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. గ్రామ జ్యోతిలో భాగంగా రూ.25వేల కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య పనుల కోసం ప్రతి గ్రామానికి రిక్షాలు అందిస్తామన్నారు. రాష్ట్రాభివృధ్ధి చూసి ప్రపంచ ఆర్థిక వేదిక ప్రభుత్వాన్ని ఆహ్వానించిందని సీఎం తెలిపారు.  హైదరాబాద్‌ చుట్టూ 100 కిలోవిూటర్ల పరిధిలో గ్రీన్‌హౌస్‌ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంటింటికీ నీళ్లు అందించేందుకు ఉద్దేశించిన పథకం జలహారం. త్వరలో జలహారం కల సాకారం చేస్తాం. సమైక్య పాలనలో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టులపై బృహత్‌ ప్రణాళికను ప్రజలు ముందుకు తీసుకువస్తాం.తెలంగాణ వాటర్‌గ్రిడ్‌ను హడ్కో అభినందించి అవార్డు కూడా ఇచ్చింది. కృష్ణా నది నుంచి 368 టీఎంసీలు, గోదావరి నుంచి 912 టీఎంసీల

నీళ్లు రావాల్సి ఉందన్నారు.  కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.