*సంక్షేమ హాస్టళ్ల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,

విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ హాస్టళ్ల అధికారులు పని చేయాలని హుజూర్నగర్  శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి అన్నారు.ఆదివారం నేరేడుచర్ల బి సి, ఎస్టీ సంక్షేమశాఖ హాస్టల్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి  ఆయన మాట్లాడాతూ.సంక్షేమ హాస్టళ్ల లో విద్యార్థుల కు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.ప్రభుత్వం హాస్టళ్ల అభివృద్ధి కి మంజూరు చేసే బడ్జెట్ సద్వినియొగం చేయాలన్నారు.ప్రస్తుత వర్షాల సీజన్ లో విద్యార్థుల ఆరోగ్య రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు వసతులు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.దుస్తులు, కాస్మొటిక్స్ విద్యార్థులందరికి అందేలా చూడాలన్నారు. హాస్టళ్ల సమస్యలు తన దృష్టికి తెస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.  గత ప్రభుత్వంలో సమస్యల నిలయాలుగా సంక్షేమ హాస్టలు ఉండేవని ఆయన తెలిపారు,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో  హాస్టల్లో ఉండే విద్యార్థులకు  నాణ్యమైన వసతులతోపాటు,సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు.అయన వెంట టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, టిఆర్ఎస్ నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు, ఇంజమూరి రాములు, తదితరులు.