సంస్కృతం – ఉర్దూ
భిన్నత్వంలో ఏకత్వం మనదేశ సంస్కృతి. రకరకాలైన మనుషు లు. రకరకాలైన భాషలు. మన దేశంలో కొన్ని వందల భాషలు వున్నాయి. కానీ మన రాజ్యాంగంలోని షెడ్యూల్‌లో 22 భాషలని చేర్చారు. మన సాంస్కృతిక వారసత్వం మన భాషల ద్వారా లభిం చింది. మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలైన భాషలు రెండు. అవి సంస్కృతం, ఉర్దూ. అన్ని భాషల్లోనూ గొప్ప సాహిత్యం వున్న ప్పటికీ ఈ రెండు భాషల్లో ఎక్కువ సాహిత్యం వచ్చింది. మిగతా భాషలని కించపరచాలని ఈ మాట అనడం లేదు. ఈ భాషల్లో వున్న గొప్పతనాన్ని గమనించాలని అంటున్న మాట. మిగతా భాషలు ప్రాంతీయమైనవి. వాటికి జాతీయ స్థాయి లేదు. ఆయా భాషల్లో వచ్చిన సాహిత్యం జాతీయ స్థాయిలో వుండవచ్చు. కానీ ఆ భాషలకి జాతీయ హోదా లభించే అవకాశం లేదు. సంస్కృతానికి, ఉర్దూకి ఆ స్థాయి వుంది. అవి జాతీయ స్థాయి భాషలు. మిగతా భాషలతో పోలిస్తే ఈ రెండు భాషలకి మతపరమైన రంగుని కల్పించారు. వాస్తవానికి అది సత్యదూరం. ఈ రెండు భాషలు జాతీయ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలు. సంస్కృతం హిం దువులకి సంబంధించినదని మరీ ముఖ్యమంగా పూజలు పునస్కా రాలకి సంబంధించినదని చాలా మంది భావన. అదేవిధంగా ఉర్దూ భాష ముస్లింలకు సంబంధించిన భాష అని, అది దేశీయ భాష కాదని అన్యదేశీయ భాష అని చాలా మంది భావన. ఈ రెండు భావనలు సరైనవి కాదు. హిందువుల పూజలు, ఉత్సవాలు సంస్కృ తంలో తత్వం వుంది. గణితం వుంది. వైద్యం, సాహిత్యం, విమర్శ ఇట్లా ఎన్నో వున్నాయి. ఇట్లా ఎన్నో వున్నప్పటికీ సంస్కృతాన్ని హిందువుల భాషగా చాలా మంది భావిస్తున్నారు. అదే విధంగా ఉర్దూని ముస్లింల భాషగా పరిగణిస్తున్నారు. నిజానికి మన దేశంలో ప్రవహిస్తున్నది సంస్కృత, ఉర్దూ వారసత్వం. అయితే ఈ రెండు భాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సంస్కృతాన్ని ప్రజలు మాట్లాడటం లేదు. అది మాతృభాష కాదు. కానీ మనదేశంలోని అన్ని భాషలకు మూలం సంస్కృతం. హిందీ అనేది సంస్కృతం నుంచి ఉద్భవించిన భాష.1947 సంవత్సరం నుంచి ఉర్దూ గురించి తప్పుడు ప్రచారం మొదలైంది. అలాంటి ప్రచారం చేయడానికి ఇతరేతర కారణాలు వుండవచ్చు. ఉర్దూ అనేది విదేశీ యుల భాష. అది ముస్లింల భాష. ఈ రెండు కారణాలు చూపిస్తూ ఉర్దూని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఉర్దూ దేశీయ భాష. మనదేశంలో ఉద్భవించిన భాష. లష్కర్ (క్యాంపు)లో పుట్టిన భాష ఉర్దూ.1947 కన్నా ముందు నుంచే ఉర్దూ ఉన్నది ముస్లింల భాషగా చూపే ప్రయత్నం జరిగింది. 1857 దురాగతం తరువాత ఆంగ్లేయులు చేసిన కుట్రలో భాగం ఈ ప్రచారం. విభజించు-పాలించు అన్న సిద్ధాంతం ప్రకారం ఉర్దూని ముస్లింల భాషగా చూపే ప్రయత్నం ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది. క్రైస్తవ మత ప్రచారం చేసే క్రమంలో ఈ రెండు భాషలని వేర్వేరుగా చూపడం జరిగింది. ముస్లిం మతస్తులకి ఉర్దూలో బైబిల్‌ని ముద్రిం చి వాళ్లకు పంచడం, హిందువులకి హిందీలో లేక వారి ప్రాంతీయ భాషల్లో ముద్రించి పంచడం చేస్తూ వచ్చారు. ఆ రకంగా ఉర్దూని ముస్లింల భాషగా చూపించే ప్రయత్నం అప్పటి నుంచి జరిగింది. 1947 తరువాత దాన్ని తరస్థాయికి తీసుకొని వెళ్లా రు.దేశ విభజన జరిగి పాకి స్తాన్ ఏర్పడిన తరువాత పాక్ లో ఉర్దూని దేశభాషగా ప్రక టించారు. దాంతో అది ము స్లింల భాష అన్న వాదన బల పడింది. ఇక్కడ జనాభా లెక్క లు చేసేక్రమంలో కొన్ని విచి త్రమైన అంశాలు మనకు కన్పిస్తాయి. పాకిస్తాన్‌లో 7.4 శాతం మంది ప్రజలు మాత్రమే ఉర్దూని తమ మా తృభాషగా చెబుతున్నారు. కానీ ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్న భాష ఉర్దూ. మనదేశంలో కొన్ని విచిత్రమైన విష యాలు కన్పిస్తాయి. మనదేశ జనాభాలో 13.4 శాతం ప్రజలు ముస్లింలు. కానీ ఉర్దూ ఏ రాష్ట్ర భాష కూడా కాదు. కేరళలో వున్న ముస్లింలు మాట్లాడుకుంటున్న భాష మళయాలం. లక్షద్వీప్‌లోని ముస్లింల జనాభా 93 శాతం. కానీ అక్కడి ముస్లింలు మాట్లాడు కుంటున్న భాష మళయాలం. కాకపోతే ఇంగ్లిషు పశ్చిమ బెంగాల్‌లో వున్న ముస్లింలు తమ మాతృభాషగా బంగ్లా భాషని చూపిస్తారు. గుజరాతీ ముస్లింలు గుజరాతీ భాషను తమ మాతృభా షగా చూపిస్తున్నారు. మన రాష్ట్రానికి వస్తే ఆంధ్రా ప్రాంతంలోని ముస్లింలు ఎక్కువగా మాట్లాడుతున్న భాష తెలుగు. ఉర్దూ కాదు.
విభజించు-పాలించు అన్న సూత్రం ఆధారంగా ఆంగ్లేయులు చేసిన కుయుక్తి కారణంగా దానికి ముస్లింల భాషగా ముద్రపడింది. హిందీ అనేది హిందువుల భాషగా, ఉర్దూ అనేది ముస్లింల భాషగా చలామణీ చేసే ప్రయత్నం ఆంగ్లేయులు చేశారు. స్వాతంత్య్రానం తరం అదే బలపడింది. మామూలు వ్యక్తులు మాట్లాడుకునే భారీబోలి (హిందుస్తానీ) పర్షియన్ భాషల సమ్మిళితంగా వచ్చిన భాష ఉర్దూ. హిందుస్తానీ పునాది మీద పర్షియన్ భాషలో ముద్రిం చిన భాష ఉర్దూ. ఈ రెండు భాషలు కలిసి కొత్త భాషగా తలెత్తిన భాష ఉర్దూ. ఈ భాష ప్రపంచంలో ఎక్కడా కన్పించదు. ఒక్క మనదేశంలో తప్ప. ఇప్పుడు పాకిస్తాన్‌లో. ఉర్దూలో రెండు భాషలు వున్నప్పటికీ క్రియలు అన్నీ భారీబోలీ నుంచి వచ్చినవే. అందుకని అది మన దేశీయ భాష. అంతేకానీ అది విదేశీ భాషకాదు. అది అతి తక్కువ మంది ముస్లింలు మాట్లాడుతున్న భాష. ఎక్కువమంది హిందువులు మాట్లాడుతున్న భాష ఉర్దూ. అందుకని దాన్ని ముస్లిం ల భాషగా పరిగణించడానికి వీల్లేదు. మన దేశంలోని ముస్లిం లందరూ భారత దేశీయులేనన్నట్టు ఉర్దూకూడా మన దేశీయ భాష. ఖురాన్ ఏ భాషలో వుందో ఆ భాషని మన దేశంలోని చాలా మంది ముస్లింలు చదవలేరు.ఉర్దూ అనేది ప్రేమ పూర్వకమైన భాష. మర్యాద పెనవేసుకున్న భాష. గొప్ప కవిత్వం వున్న భాష. కవిత్వాన్ని గొప్పగా వ్యక్తీకరించడానికి అనువుగా వున్న ఏకైక భాష ఉర్దూ.అదేవిధంగా గొప్ప భావాలని క్లుప్తంగా వ్యక్తీకరించడానికి అనువుగా వున్న భాష సంస్కృతం. ఉర్దూ భాష ఏ రాష్ట్ర భాషకాదు. అదేవిధంగా సంస్కృతం కూడా ఏ రాష్ట్ర భాషకాదు. ఇవీ రెండూ మన జాతీయ భాషలు. మన సంస్కృతిక వారసత్వాన్ని పొదిగివున్న భాషలు సంస్కృతం, ఉర్దూ. దురదృష్టవశాత్తు ఈ రెండింటికి మత ముద్రని అనవసరంగా పులిమారు. ఇవి రెండు కూడా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఈ రెండు భాషల్లో వచ్చిన గొప్ప సాహిత్యాన్ని అందరూ చదవాల్సిన అవసరం వుంది.ఈ రెండు భాషలకి గౌరవా న్ని ఇవ్వాలని, ఈ రెండు భాషల్లోని సంస్కాృతిక వారసత్వం కొనసా గాలన్న ఉద్దేశ్యంతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్‌కౌన్సిల్ అధ్యక్షులు మార్కండేయ కట్జూ అలహాబాద్ హైకోర్టు న్యాయ మూర్తిగా వున్నప్పుడు ఈ రెండు భాషలకు సంబంధించి ఓ ప్రధానమైన తీర్పుని వెలువరించారు. ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్ లో మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సంస్కృతాన్ని, ఉర్దూని తప్పనిసరిగా చదివేవిధంగా శాసనం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. (రమేశ్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ) సాంస్కృతిక వారసత్వం లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించదని ఆయన అభిప్రాయం. అవి తప్పనిసరి చేయకపోయినా పర్వాలేదు కానీ వాటికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం.భాషకి మతం వుండదు. భాష అనేది కొన్ని పదాల సముచ్ఛయం. మామూలు ప్రజలు మాట్లాడు కునే భాష. ఒక జాతి, ఓ ప్రాంతం, భౌగోళికంగా వున్న ప్రజలు మాట్లాడుకునే భాష. లేదా కవిత్వం సాహిత్యం, శాస్త్రం గురించి వివరించుకునే భాష. ఓ వారసత్వ ప్రతీక భాష. అంతేగాని మతానికి ప్రతీక ఎప్పటికీ కాదు. ‘భగవాన్ తేరా లాక్ లాక్ షుక్రియా హై!’ ఈ అభిప్రాయాన్ని నాదేశ ప్రజలకు కలిగించు.