సచిన్ రికార్డును బ్రేక్ చేసే సత్తా జోరూట్‌కు ఉంది
భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా
న్యూఢల్లీి,జూలై7(జనంసాక్షి): టెస్టుల్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. మరో ఐదు ఆరేళ్ల పాటు ప్రస్తుత స్థాయిలో ఆడితే ఈ అరుదైన మైలురాయిని చేరుకోగలడని జాఫర్ తెలిపాడు. కాగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదు టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్,జానీ బెయిర్ స్టో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు తొలి
ఇన్నింగ్స్‌లో 31పరుగులు సాధించన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులతో చెలరేగాడు. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 737 పరుగులతో జో రూట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రూట్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. ’రూట్‌కు ప్రస్తుతం కేవలం 31 ఏళ్లు మాత్రమే. కానీ ఇంగ్లండ్, ఆసీస్ క్రికెటర్లు త్వరగా తమ కెరీర్‌లను ముగిస్తూ ఉంటారు. అయితే అతడు మరో 5`6 ఏళ్లు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేయగలడు’ అని జాఫర్ పేర్కొన్నాడు.